(Local) Sat, 24 Jul, 2021

అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు...నాని

September 03, 2019,   4:12 PM IST
Share on:
అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు...నాని

మైత్రీ మూవీ మేకర్స్.. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'.  విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రియా అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ  దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లతో పాటుగా టీజర్ ట్రైలర్లకు కూడా విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా నుండి వినాయక చవితి సందర్భంగా 'నిను చూసే ఆనందంలో' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రబృందం.

ప్రియా అరుల్ మోహన్ చీర కట్టుకుని.. 'ఎలా ఉంది' అని నానిని అడిగితే, పైనుండి కింది వరకు చూసి.. 'రైటర్‌నయ్యిండి చెప్పడానికి నాకే మాటలు రావడం లేదు.. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ఇట్స్ ఏ క్రైమ్'.. అనగానే ప్రియా : 'దగ్గరకు రా' అని పిలవడంతో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అనంత శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాయగా, సిడ్ శ్రీరామ్ అంతే చక్కగా పాడాడు. ఈ కూల్ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ కు అనిరుధ్ అందించిన ట్యూన్.. ఇన్స్ట్రుమెంటేషన్ కొత్తగా ఉన్నాయి. ఈ చిత్రంలో  అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, ప్రణ్య, సత్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనిరుధ్, కెమెరా : మిరోస్లా కూబా బ్రోజెక్, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : వెంకీ, డార్లింగ్ స్వామి, ఆర్ట్ : రామ్ కుమార్, సీఈఓ : చిరంజీవి (చెర్రీ).

సంబంధిత వర్గం
డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!
డీసెంట్ కలెక్షన్స్ తో గ్యాంగ్ లీడర్!!
నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్ వచ్చేసింది.......
నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్ వచ్చేసింది.......

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.