(Local) Sat, 19 Oct, 2019

లేడి సూపర్ స్టార్ ‘నెట్రికన్’ టైటిల్ పోస్ట‌ర్....

September 16, 2019,   12:26 PM IST
Share on:
లేడి సూపర్ స్టార్ ‘నెట్రికన్’ టైటిల్ పోస్ట‌ర్....

"మనస్సినక్కరే" అనే మలయాళ చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమైన నయనతార, తెలుగులో మాత్రం 2006లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో హీరో వెంకటేష్ సరసన లక్ష్మి చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో తనదైన నటనతో మెప్పిస్తూ లేడీ సూప‌ర్ స్టార్ స్థానాన్ని సంపాదించుకుంది. కాగా ఈ లేడీ సూప‌ర్ స్టార్ ఇటు తెలుగు, అటు త‌మిళంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్నా సంగ‌తి తెలిసిందే. న‌య‌న్ న‌టించిన సైరా చిత్రం ద‌స‌రా కానుకగా విడుద‌ల కానుండ‌గా, ఆమె ప్ర‌స్తుతం త‌న 65వ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ నిర్మిస్తుండ‌గా, మిలింద్ ర‌వ్ తెర‌కెక్కిస్తున్నాడు. థ్రిల్ల‌ర్‌తో పాటు ఆస‌క్తిక‌రంగా ఉండ‌నున్న ఈ చిత్రానికి నెట్రికన్‌ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌లో టైటిల్ బ్రెయిలీ లిపీతో రూపొందించిన‌ట్టుగా ఉంది. చిత్రంలో న‌య‌న‌తార అంధురాలిగా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. పోస్ట‌ర్‌లో పేపర్‌ చుట్టూ రక్తం, బేడీలు కూడా ఉన్నాయి. క్రైమ్‌ నేపథ్యంలో సినిమాను తీస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ శివ‌న్ నిర్మాత‌గా మారుతున్నాడు.  నయనతార 65వ సినిమా ‘నెట్రికన్‌’ ను రౌడీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా న‌య‌న తార త‌మిళంలో ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్, విజ‌య్ బిగిల్ చిత్రాల‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వర్గం
దళపతి మూవీ ట్రైలర్ చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..
దళపతి మూవీ ట్రైలర్ చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.