(Local) Wed, 02 Dec, 2020

లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?

November 27, 2019,   1:50 PM IST
Share on:
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?

చిత్రరంగంలో హీరోల క్రేజ్ తో పోలిస్తే హీరోయిన్స్ క్రేజ్ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు...హీరోస్ కి దీటుగా నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ లేడి సూపర్ స్టార్ పేరుగాంచిన తార నయనతార.  ‘చంద్రముఖి’ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ లేడీ సూపర్ స్టార్. అయితే ఆమె కెరియర్ ఆ సినిమాతోనే ప్రారంభం కాలేదు. రజినీకాంత్ మాదిరి బస్ కండక్టర్ నుంచి సినిమా హీరోగా ఎదిగినట్టే.. నయనతార కూడా కిందిస్థాయి నంచే వచ్చారు. తొలుత ఆమె ఓ మాలయాళం టీవీ ఛానల్‌లో యాంకర్‌గా తన కెరియర్ ప్రారంభించారు. అప్పుడు నయన్ వయసు 16 ఏళ్లు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నయన్ ఇంతవరకు ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వలేరు గనక. తన పర్సనల్ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తాను నటించిన సినిమా ప్రమోషన్లలోనే నయన్ పాల్గొనదు అనే విషయం తెలిసిందే.
నయన్ యాంకర్‌గా వార్తలు చదువుతున్నప్పుడు వీడియోలో ‘నా పేరు డయానా మరియం కురియన్’ అంటూ తన గురించి తాను పరిచయం చేసుకుంటూ కనిపించారు. యాంకర్‌గానూ నయన్ స్టైలిష్‌గా ఉన్నారు. అసలు నయనతారేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. తమిళం, మలయాళం సినిమాల్లో మాత్రమే నయన్ తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ తెలుగులో మాత్రం ఆమెకు ఇతరులు డబ్బింగ్ చెబుతారు. దీంతో తొలిసారి నయన్ ఒరిజినల్ వాయిస్ విని తెలుగు ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కాగా, నయన్ 2003లో వచ్చిన ‘మనస్సినక్కరే’ అనే మలయాళం సినిమాతో టీవీ యాంకర్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 15 ఏళ్ల సినీ కెరీర్‌లో నయన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నయన్ డేట్ల కోసం హీరోలు వెయిట్ చేసేంతగా పేరు తెచ్చుకున్నారు. 

సంబంధిత వర్గం
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.