(Local) Wed, 20 Oct, 2021

సైరా విషయంలో నయన్ అలక..!

October 03, 2019,   6:04 PM IST
Share on:
సైరా విషయంలో నయన్ అలక..!

కొణిదెల ప్రొడక్షన్స్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ అయినందుకు సైరా యూనిట్ కన్నా ఎక్కువగా హీరోయిన్ తమన్నానే సంతోషంతో గంతులేస్తుంది. ఈ సినిమాలో సైరాకి భార్య సిద్దమ్మ పాత్రలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తే... నరసింహారెడ్డి ప్రేమికురాలి పాత్రలో తమన్నా నటించింది. సైరా సినిమా విడుదలయ్యాక సినిమాలో నయన్ పాత్ర కన్నా తమన్నా లక్ష్మి పాత్ర హైలెట్ అవడమే కాదు.. నయన్ కన్నా ఎక్కవగా తమన్నా పాత్రకి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండడం వలనే నయనతార అలిగి సైరా ప్రమోషన్స్ కి డుమ్మాకొట్టిందనే ప్రచారం జరుగుతుంది. తమన్నా కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి.. మెయిన్ హీరోయిన్ అయిన తనని లైట్ తీసుకోవడం పై నయన్ ఆగ్రహంగా ఉండడంతోనే చరణ్ రిక్వెస్ట్ ని కాదంది అంటున్నారు.
 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.