(Local) Mon, 17 May, 2021

హౌస్ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..

October 17, 2019,   4:02 PM IST
Share on:
హౌస్ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..

బాలీవుడ్ యాక్షన్ హీరోస్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ కథానాయకులుగా, దగ్గుబాటి రానా ప్రతినాయకుడిగా, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా తెరకెక్కిన మూవీ ‘హౌస్‌ఫుల్ 4’. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ మూవీకి  ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ ‘హౌస్‌ఫుల్ 4’ మూవీని పునర్జన్మల నేపధ్యంలో సాగే కథతో తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ టైం దగ్గరపడుతుండంతో చిత్రయూనిట్ మూవీ ప్రమేషన్స్ వేగవంతం చేసింది.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ‘భూత్ రాజా బహార్ ఆజా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాంత్రికుడిగా కనిపించిన ఈ పాటలో సినిమాలోని మెయిన్ లీడ్స్ అందరూ సందడి చేశారు. ‘హాం ఫట్.. అలియా భట్’ అంటూ నవాజుద్దీన్ సిద్దిఖీ.. అక్షయ్ కుమార్‌కి పట్టిన భూతాన్ని వదిలించడానికి ప్రయత్నించడం... నాలోపల ఎలాంటి భూతం లేదు అని అక్షయ్ వేడుకోవడం.. ఇలా ఫన్నీగా ఉందీ వీడియో సాంగ్... నిన్న యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ ఇప్పటివరకు 6 మిలీనియం...వ్యూస్ తో దూసుకువెళ్తూ ట్రేండింగ్ లో ఉంది. ఈ సాంగ్ కి డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ లిరిక్స్ రాయగా, మికా సింగ్, ఫర్హాద్ సామ్జీ కలిసి పాడారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా ఇతర పాత్రల్లో నటించిన ఈ ‘హౌస్‌ఫుల్ 4’ దివాలి కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.