(Local) Sun, 20 Jun, 2021

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను హిట్ కొట్టాడు!

September 10, 2019,   3:07 PM IST
Share on:
టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను హిట్ కొట్టాడు!

2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో రాకేష్ పాత్రలో తెలుగు తెరకి పరిచమైన నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత దోపిడీ, నేనొక్కడినే చిత్రాలలో సపోర్టింగ్ పాత్రలలో నటించాడు. కాగా 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన నవీన్ తాజాగా హిందీ లో కూడా తన మొదటి సినిమాతో హిట్ అందుకున్నాడు. సుశాంత్ రాజ్ పుత్, శ్రద్దా కపూరే హీరోహీరోయిన్ గా తెరకెక్కిన చిచోరే సినిమాలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో యాసిడ్ అనే కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్ లో నవీన్ పోలిశెట్టికి ఫస్ట్ డెబ్యూ మూవీ.  లెన్త్ విషయంలో మెలో డ్రామా విషయంలో కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా ఓవరాల్ గా మంచి టైంపాస్ మూవీ అని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ సీన్స్ ఎమోషనల్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నవీన్ యాక్షన్ కి చాలామంది ఫిదా అయిపోయారు. దాంతో మనోడికి అక్కడ మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశముందని అక్కడ బాలీవుడ్ మీడియా వారు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.