(Local) Fri, 17 Sep, 2021

గ్యాంగ్ తో శ్రీవారిని దర్శించుకున్న నాని....

September 09, 2019,   4:14 PM IST
Share on:
గ్యాంగ్ తో శ్రీవారిని దర్శించుకున్న నాని....

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో ఐదుగురు మహిళలకు నాని లీడర్ గా, రివెంజ్ స్టోరీ రైటర్‌గా నటిస్తుండగా ప్రతినాయకుడి పాత్రలో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ఈ మోవుయి విడుదల తేదీ దగ్గరపడుతుండంతో  తాజాగా తిరుమల శ్రీవారిని గ్యాంగ్ లీడర్ చిత్ర టీం హీరో నాని, చిత్ర నిర్మాతలు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామసమయంలో స్వామి వారి మూలవిరాట్టును దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శాననంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్బచనం‌ అందించగా, టీటీడి అధికారులు స్వామి ‌వారి పట్టువస్త్రాలను,తీర్ధప్రసాదాలను అందజేశారు. హీరో నాని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల‌ సంధర్భంగా స్వామి వారిని దర్శించుకొ‌ని మొక్కులు చెల్లిచుకున్నామని పేర్కోన్నారు.

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు...నాని
అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు...నాని

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.