(Local) Sun, 20 Oct, 2019

వాళ్ళిరువురు కృష్ణ అర్జునులు అంటున్న....తలైవా

August 12, 2019,   12:06 PM IST
Share on:
వాళ్ళిరువురు కృష్ణ అర్జునులు అంటున్న....తలైవా

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి సవరణపై రాజకీయ నాయకులు, ప్రజలు, సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున స్పందిస్తున్న సంగతికూడా విదితమే. కాగా భారత ఉపరాష్ట్రపతిగా రెండేళ్ల ప్రస్థానంపై వెంకయ్యనాయడు రాసిన లిజనింగ్, లెర్నింగ్.. లీడింగ్ పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఆదివారం చెన్నై‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ  కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవ్వగా అందులో తలైవా రజినీకాంత్  ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో రజిని ఆర్టికల్ 370ని  రద్దు చేయడంపై స్పందిస్తూ  ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ఇరువురూ కృష్ణార్జునులు వంటి వారని సూపర్‌స్టార్‌ వ్యాఖ్యానించారు. అంతేకాక మిషన్‌ కశ్మీర్‌కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలని, పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతమని అమిత్‌షా మోడీ ఇద్దరూ కృష్ణార్జుల కాంబినేషన్‌ అని పేర్కొన్నారు. ఎవరె లాంటివారో వారికి మాత్రమే తెలుసు. మీకంతా శుభాలే కలగాలి అని కోరారు ఉపరాష్ట్రపతి గురించి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తారని, వెంకయ్య నాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని, ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారని వ్యాఖ్యానించారు.అంతేకాక ఆయన రాజకీయాల్లోకి కాకుండా... ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్లి ఉంటే ఓ గొప్ప మార్గదర్శకుడయ్యేవారని ప్రశంసించారు. అలాంటి ఆధ్యాత్మిక వేత్తను తాము పోగొట్టుకున్నామని రజినీకాంత్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో వెంకయ్య నాయుడు, అమిత్ షా చిరునవ్వుతో కనిపించారు.

సంబంధిత వర్గం
రజినీతో నటించాలనుంది: కాజల్
రజినీతో నటించాలనుంది: కాజల్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.