(Local) Mon, 27 Sep, 2021

నాని బ్యానర్‌పై 'హిట్‌' చిత్రం...

October 24, 2019,   4:11 PM IST
Share on:
నాని బ్యానర్‌పై 'హిట్‌' చిత్రం...

2008లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో అష్ట చమ్మ చిత్రంతో వెండితెరపై తెరంగ్రేటం చేసిన హీరో నాని. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ నాచురల్ స్టార్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకపక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క ప్రొడ్యూసర్ మారి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అ’ అనే వైవిధ్యమైన సినిమాను నిర్మించి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక తన బ్యానర్ పై రెండవ వెంచర్ గా ఒక వైవిధ్యమైన కథాంశంతో ‘హిట్’ అనే టైటిల్ తో సినిమాను ప్రారంభించారు నాని. నేడు హైదరాబాద్ లో ఈ సినిమా అధికారిక పూజ కారక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయి.

ఫలక్నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా చి లా సౌ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా శైలేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు మణికందన్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసిన నాని, మా సినిమాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చేసారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది…!!

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
“జెర్సీ” హిందీ రీమేక్ లో కూడా అతడే హీరో...?
“జెర్సీ” హిందీ రీమేక్ లో కూడా అతడే హీరో...?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.