(Local) Wed, 21 Aug, 2019

నాచురల్ స్టార్ "వి" లుక్....!

August 12, 2019,   3:19 PM IST
Share on:

నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని గ్యాప్ లేకుండా షూటింగ్ ల్లో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు ఒక సినిమా పూర్తి అయిందో లేదో..మరో వైపు కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఏ మాత్రం ఖాళీ లేకుండా పనులు పూర్తి చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఆగస్టు 30నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా…ప్రభాస్ సాహో కోసం సినిమా విడుదలను వాయిదా చేశారు.  నాని తన 25వ సినిమాలో మరో ప్రయాగానికి సిద్ధంగా ఉన్నటు తెలుస్తోంది.  ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వి" సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.  ఆదివారం "వి" షూటింగ్‌కు హాజరయ్యాడు నాని. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నాడు.  అదితిరావ్‌ హైదరీ, నివేదా థామస్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్‌ సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

సంబంధిత వర్గం

నాని కలుసుకునే అవకాశం కావాలా ---ఐతే ఇలా చేయండి.... ...
సెప్టెంబర్ 13న వస్తున్నా గ్యాంగ్ లీడర్.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.