(Local) Tue, 29 Sep, 2020

నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్ వచ్చేసింది.......

August 28, 2019,   12:08 PM IST
Share on:
నాని 'గ్యాంగ్ లీడర్' ట్రైలర్ వచ్చేసింది.......

విలక్షణ దర్శకుడు విక్రం కుమార్ ద‌ర్శక‌త్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. జెర్సీ సినిమా త‌ర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా, ఈ చిత్రాన్ని ఓ ఐదుగురు ఆడవాళ్ళ రివెంజ్ నేపథ్యంలో సరికొత్త కథాంశంతో తెరకెక్కడం విశేషం. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా కొద్దీ సేపటి క్రితం ట్రైల‌ర్ రిలీజ్ చేసింది. పెన్సిల్‌ పార్ధసారధిని, అత‌ని గ్యాంగ్ ని టీజర్ తోనే పరిచయం చేసినా మరోసారి వారి సంద‌డిని ట్రైల‌ర్‌లో చూపించారు. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్రలో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న రైట‌ర్ కావడానికి ఇంగ్లీష్ సినిమాలను కాపీ కొడుతూ ఉండే రివెంజ్ స్టోరీలు రాసే పాత్ర ఆయనది. ఈ నేపథ్యంలో బామ్మగా లక్ష్మి, వరలక్ష్మిగా శరణ్య, ప్రియ, స్వాతి, చిన్ను అంటూ ఐదుగురు ఆడవాళ్ళూ ఓరోజు అనుకోకుండా నలుగురు మహిళలు, ఓ చిన్నారి నానిని వెతుక్కుంటూ వెళ్తారు. అతనితో కలిసి ఒక్కొక్కరిపై పగలు తీర్చుకుంటూ ఉంటారు. ట్రైలర్లో.. ‘ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయచేయగలిగే ఒకే ఒక్క పవరఫుల్ వెపన్ అమ్మాయి’ అని నాని హీరోయిన్‌ను చూసి అంటాడు. దాంతో వెనకే ఉన్న బామ్మ లక్ష్మి ‘నేను వెళతా నేను వెళతా’ అనడం నవ్వులు పూయిస్తోంది.  ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి  పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు . స‌రికొత్త క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్‌ని చూస్తే అర్ధ‌మవుతుంది. 

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
'గ్యాంగ్‌ లీడర్‌' కి దారిచ్చిన 'వాల్మీకి'...
'గ్యాంగ్‌ లీడర్‌' కి దారిచ్చిన 'వాల్మీకి'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.