(Local) Sun, 17 Oct, 2021

బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 16 విశేషాలు......తమన్నా రచ్చ!

August 06, 2019,   11:52 AM IST
Share on:
బిగ్ బాస్ సీజన్ 3 ఎపిసోడ్ 16 విశేషాలు......తమన్నా  ...

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయింది. మొదట్లో షో కాస్త స్లోగా, చప్పగా స్టార్ట్ అయిన కూడా ఆ తదుపరి హౌస్ లో సినివేశాలురసవత్తరంగా  నడుస్తోంది.  ఇంట్లో ఎలిమేషన్ మొదలవ్వడం, లగ్జరీ బడ్జెట్ టాస్క్ లు ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే షో కాస్తఊపందుకుంది. తాజాగా ఆదివారం ఫేమ‌స్ రిపోర్ట‌ర్ జాఫ‌ర్ ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే 16 ఎపిసోడ్లను పూర్తిచేసుకున్న తెలుగు బిగ్ బాస్ షో మూడవ వారం ఓపెన్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించారు. కాగా ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్ లో ఉండే సభ్యుల్లో ఎవరైనా ఎన్నుకుని సరైన కారణం చెప్పి ఎలిమినేటెడ్ స్టాంప్ తీసుకెళ్లి.. తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ముఖం మీద కాని… చేతి మీద కానీ… స్టాంప్ వేయాలి. ఇలా  ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దరి ఇంటి సభ్యులని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే.. జాఫర్ పోతూపోతూ హౌస్ లో గ్రూప్స్ ఉన్నాయని చెప్పడంతో దాని ఎఫెక్ట్  ఈ వారం నామినేషన్ మీద బాగానే కనిపించింది అందుకు అనుగుణంగా  ఒక గ్రూప్ సభ్యులను టార్గెట్ చేస్తూ మరో గ్రూప్ సభ్యులు నామినేట్ చేసినట్టు అనిపించింది.

మొత్తానికి ఈ వారంలో ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తమన్నా, పునర్నవి, రాహుల్, వితిక, బాబా భాస్కర్ నామినేషన్స్ లో ఉన్నారు.
అయితే.. నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా పునర్నవి కొంచెం భావోద్వేగానికి గురయింది. చాలామంది తననే నామినేట్ చేస్తూ… తను సరిగ్గా ఎవరితో కదలదు అంటూ చెప్పేసరికి..తాను  ఎంతగా అందరితో కనెక్ట్ అవుతున్నా కూడా ఇలా తనను టార్గెట్ చేయడం నచ్చలేదంటూ పునర్నవి భావోద్వేగానికి గురై తనను తాను నామినేట్ చేసుకుంది.
అయితే.. బిగ్ బాస్ హౌస్ నియమాల ప్రకారం ఎవరిని వారు నామినేట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడం. కాదంటే ఇంటి సభ్యులంతా ఈ వారం నామినేట్ కావాల్సి వస్తుందని… లేదా ప్రతి వారం పునర్నవి డైరెక్ట్ గా ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వాలని రెండు విషయాలను బిగ్ బాస్ తెలియజేస్తాడు. చివరకు కెప్టెన్ వరుణ్ కల్పించుకొని.. పునర్నవి తో ప్రైవేట్ గా మాట్లాడి….కన్విన్స్ చేయడంతో పునర్నవి కాస్త కూల్ అయి… శివజ్యోతి, బాబా భాస్కర్ ను నామినేట్ చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది.

అయితే కంటేస్టెంట్స్ తమకు నచ్చని వారిని స్టాంప్ వేసి నామినేట్ చేసే సందర్భంలో తనని నామినేట్  చేసినందుకు తమన్నా సింహాద్రి అతిగా ప్రవర్తించింది. నామినేషన్ లో తన పేరు ని చెప్పి, తన బిహేవియర్ మార్చుకోమని చెప్పిన వారిని తమన్నా దూషించడం చర్చనీయాంశమైంది. వచ్చినప్పటి నుండి తమన్నా తీరు అతిగానే ఉన్నప్పటికీ  ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. కానీ నిన్న ఆమె ప్రవర్తించిన విధానం ప్రేక్షకుల దృష్టిలో తనను తాను తక్కువచేసుకునేలా అనిపించింది. నామినేట్ చేసిన వారిని పర్సనల్ గా టార్గెట్ చేసి బూతు పురాణం చదవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవ్వరేం చెప్పినా అర్థం చేసుకోకుండా అదే పనిగా తిట్టడం... నేను ఇక్కడికి తిని పడుకోవడానికి రాలేదని, గొడవలు పెట్టుకోవడానికే వచ్చినట్లు మాట్లాడడంతో ప్రేక్షకులు విసిగిపోయారు. ట్రాన్స్ జెండర్ ల కమ్యూనిటీకి  రిప్రెసెంట్ గా వచ్చి వాళ్ళ పరువును తీసే విధంగా తమన్నా ప్రవర్తన ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమన్నా తన ప్రవర్తనని మార్చుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వందశాతం ఉంది. మరి ఈ విషయం గ్రహించి తనని తాను మార్చుకుని బయట వారికి ఒక స్ఫూరిగా నిలుస్తుందా లేదా చూడాలి....

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.