(Local) Mon, 26 Aug, 2019

ఎన్టీఆర్,నానిను మించిన మన్మథుడు....

August 02, 2019,   10:25 AM IST
Share on:

నాగార్జున హోస్ట్ గా ప్రారంభం బిగ్ బాస్ 3 మొద‌టి వారం పూర్తి చేసుకుని రెండో వారం వైపు ప‌రుగులు పెడుతోంది. మొద‌టి ఆరు రోజులు ర‌చ్చ ర‌చ్చ‌గా సాగితే రెండో వారం అంత‌కు మించి అన్నట్టుగా సాగుతోంది. ఇక టీఆర్పీలో ను అదే జోరును కొన‌సాగిస్తూ దూసుకుపోతోంది. గత రెండు సీజ‌న్ల తో పోలీస్తే ముచ్చ‌ట‌గా మూడ‌వ సీజ‌న్ అభిమానులకు వినోదాన్ని బాగానే పంచుతుందంట‌. ఇక గ‌త సీజ‌న్ హెస్ట్ లుగా చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ , నానిల‌ను ప‌క్క‌కు నెట్టి నాగార్జున టాప్ లోకి దూసుకు వ‌చ్చాడు.  టీఆర్పీలను చూస్తే మూడో సీజన్‌ గత సీజన్ల కన్నా ఎక్కువగా ప్రజాధరణ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు హోస్ట్‌గా నాగార్జున కూడా ఎన్టీఆర్‌, నానిలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడట. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్‌ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. జూలై 21న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే హేమ ఎలిమినేట్‌ కాగా, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌ బాస్‌ 3తో పాటు మన్మథుడు 2 సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నాగ్‌, బుల్లి తెర మీద తన ఆదిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు.

సంబంధిత వర్గం

అస్వస్థతకి గురైన నాగార్జున ..!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.