(Local) Sun, 20 Jun, 2021

తండ్రి సినిమా నుండి తప్పుకున్న తనయుడు ?

September 28, 2019,   5:22 PM IST
Share on:
తండ్రి సినిమా నుండి తప్పుకున్న తనయుడు ?

రియల్ లైఫ్ లోనే కాకుండా రీల్ లైఫ్ లో కూడా కొందరు స్టార్స్ కలిసి నటిస్తే చూడాలని చాలామంది ఫాన్స్ అనుకోవడం చూస్తూనే ఉంటాం...అదే ఒక ఫ్యామిలీలో హీరోలయితే ఆ కోరిక ఇంకాస్త బలంగా ఉంటుంది. అయితే అలాంటి ఓ కోరికను అక్కినేని ఫ్యామిలీ నిజం చేయడానికి తర్వలో ‘బంగార్రాజు’ మూవీ ద్వారా  అభిమానులకి అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది. నాగచైతన్య ‘బంగార్రాజు’ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అలానే చైతు కి జోడిగా సమంత నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈమధ్యే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఫుల్ స్క్రిప్ట్ తో చైతుని కలిసి కథ చెప్పినట్టు తెలుస్తుంది. చైతుకి కథ నచ్చకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే చైతు ఈమూవీ నుండి పూర్తిగా తప్పుకున్నాడా? లేదా కథలో ఏమన్నా మార్పులు చేసుకుని రమ్మన్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.