(Local) Mon, 12 Apr, 2021

నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...

November 22, 2019,   3:45 PM IST
Share on:
నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్...

సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఏమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాణంలో అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి జంటగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుండి చిత్రయూనిట్ నాగ చైతన్య లుక్ కి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో సూపర్ కూల్ లుక్‌లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. అయితే రేపు నవంబర్ 23న చైతు పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ తెలిపారు. చైతు హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది. నేచురల్ క్యారెక్టర్స్‌తో బ్యూటిఫుల్ కథలను తెరపై ఆవిష్కరించే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య లుక్, క్యారెక్టర్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలోకి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త ఎక్స్ పీరియన్స్‌గా ఉండ బోతుంది ఆ వీడియో. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.