(Local) Mon, 16 Sep, 2019

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తో ప్రభాస్ డాన్స్....

August 22, 2019,   3:24 PM IST
Views: 131
Share on:
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తో ప్రభాస్ డాన్స్....

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ.350 కోట్లతో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న ‘సాహో’ సినిమా ప్రమోషన్‌లో వేగం పెంచారు.  మ‌రోప‌క్క ప్ర‌భాస్ సైతం సాహో మూవీ ప్ర‌మోష‌న్స్‌తో నిమిషం ఖాళీ లేకుండా గ‌డుపుతున్నారు. బాహుబ‌లి స‌మ‌యంలో ప్ర‌త్యేకించి ఏ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌ని ప్ర‌భాస్ సాహో ప్ర‌చారం కోసం అన్ని ఇండ‌స్ట్రీల‌ను తిరిగేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్‌పై ప్ర‌భాస్ ప్ర‌త్యేక దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తుంది. గ‌త వారం రోజుల నుంచి బాలీవుడ్‌లోనే మ‌కాం వేసిన ప్ర‌భాస్ ప్ర‌ముఖ హీరోలు నిర్మాత‌గా, వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తూ సాహో ప్ర‌చారాన్ని షురూ చేశాడు. అందులో భాగంగానే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌చ్ బ‌లియే 9 షోలో ప్ర‌భాస్ పాల్గొన్నాడు. షోకు మ‌రింత హైప్ తీసుకొచ్చేందుకు ప్లే చేసిన బాలీవుడ్ కిక్ మూవీలోని జుమ్మేకీ రాత్‌హై పాట‌కు ప్ర‌భాస్ స్టెప్పులేశాడు. అది కూడా కిక్ మూవీ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండ్జ్‌తో క‌లిసి హీరో స‌ల్మాన్ వేసిన స్టెప్పు మాదిరి న‌చ్ బ‌లియే 9 షోలో కూడా బీటౌన్ హాట్ బ్యూటీ ర‌వీనా టాండ‌న్ చీర‌ను నోటితో ప‌ట్టుకున్న ప్ర‌భాస్ స్టెప్పుల‌తో రెచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. 

సంబంధిత వర్గం
ఇంటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోండి...నాగార్ ...
ఇంటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోండి...నాగార్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.