(Local) Mon, 27 Sep, 2021

డిసెంబర్ 27న విడుదలవుతున్న తమిళ ‘సైకో’..

November 12, 2019,   4:54 PM IST
Share on:
డిసెంబర్ 27న విడుదలవుతున్న తమిళ ‘సైకో’..

డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘సైకో’...ముగమూడి’ (మాస్క్), ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్) సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ మిస్కిన్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరీ, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ‘సైకో’ టీజర్ యూట్యూబ్ లో 2.8 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ అంచనాలు పెంచేస్తోంది. థియేటర్లో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా థ్రిల్ కలిగిస్తుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 27న ‘సైకో’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలను అందించారు. 

సంబంధిత వర్గం
ఉగాదికి వైలెన్స్​తో వస్తున్నా: నాని
ఉగాదికి వైలెన్స్​తో వస్తున్నా: నాని

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.