(Local) Wed, 24 Jul, 2019

విక్ర‌మ్ ‘మిస్ట‌ర్ కేకే’ ట్రైల‌ర్ విడుదల

July 04, 2019,   12:47 AM IST
Share on:

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తనదంటూ ట్రేడ్ మార్క్ తో సినిమాలు చేస్తూ అభిమానులని అలరించే చియాన్. శివ పుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలలలో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు అనడానికి నిదర్శనాలు. ఇక ప్రస్తుతం అయన నటించిన కొత్త చిత్రం ‘మిస్టర్ కేకే’. తమిళంలో ‘కదరం కొండన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మిస్టర్ కేకే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు.  ఈ చిత్ర ట్రైల‌ర్ ఇప్పుడు విడుద‌లైంది.

ట్రైలర్ లో... కొంచం భయంగా ఉంది వాసు అంటూ అక్షర హాసన్ తో మొదలవ్వగా, ఆ తర్వాత యాక్షన్ సీన్స్ తో కొనసాగుతుంది. ఇందులో విక్రమ్ నువ్వు ఆడుకున్నది నాతో కాదు యముడితో అని చెప్పే డైలాగు ట్రైలర్ రేంజ్ ఏంటో చెబుతుంది. ఇక ట్రైలర్ ని గమనించగా ఇందులో అక్షర హాసన్ గర్భవతిగా నటిస్తోంది. ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లను అడ్డుకోవడం కోసం విక్రమ్ రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో సినిమా కథ నడుస్తుంది. మొత్తానికి ఈసారి సరికొత్త గెటప్ తో విక్రమ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. రాజేష్ ఎమ్ సెల్వ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అంతా విదేశాల్లోనే జ‌రిగింది. క‌మ‌ల్ హాస‌న్ రాజ్ క‌మ‌ల్ క్రియేష‌న్స్ సంస్థ‌లో ఈ చిత్రం తెర‌కెక్కింది. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.