(Local) Mon, 12 Apr, 2021

మోడీతో సైరా...

October 15, 2019,   2:00 PM IST
Share on:
మోడీతో సైరా...

కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “సైరా నరసింహ రెడ్డి". ఈ చిత్రం గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు,తమిళ్,హిందీ, మలయాళం,కన్నడ భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. మొట్టమొదటిసారి మెగాస్టార్ ఒక స్వాతంత్ర్య సమరయోధుని పాత్రలో నటించి తన డ్రీమ్ ని నెరవేర్చుకోవడంతో పాటు మళ్ళీ తన నటనతో అభిమానులనే కాకుండా చాలా మంది ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన వారు చిగురంజీవిని పొగుడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. కాగా సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. సైరా చిత్రాన్ని చూడాలని చిరంజీవి కోరగా, ఆ విషయంలో సీఎం జగన్ చాలా సానుకూలంగా స్పందించారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 16 వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. చిరంజీవి తో పాటు గంటా శ్రీనివాస్ కూడా వెళ్లనున్నారు. అక్కడ మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో భేటీ అవ్వనున్నారు చిరంజీవి. కాగా సైరా చిత్రాన్ని చూడాలని వెంకయ్య నాయుడు నూయి కోరుతూ… రాజకీయాల కోసం చర్చించనున్నారని సమాచారం. ఆతరువాత చిరంజీవి, ప్రధాని మోడీని కూడా కలవనున్నారని సమాచారం. ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకొని తన సైరా చిత్ర విశేషాలు చెప్పి, సైరా చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రధానిని కోరనున్నట్లు సమాచారం.

సంబంధిత వర్గం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.