(Local) Thu, 21 Nov, 2019

పవన్ పుట్టినరోజు సందర్భంగా అలరిస్తున్న కామన్ డీపీ.....

August 29, 2019,   1:58 PM IST
Share on:
పవన్ పుట్టినరోజు సందర్భంగా అలరిస్తున్న కామన్ డీపీ. ...

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెప్టెంబరు 2న తన 48వ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి నుంచే హడావుడి మొదలెట్టేశారు పవన్ అభిమానులు. పవన్ బర్త్‌డే‌కు సరిగ్గా ఐదు రోజుల ముందు మెగా అభిమానులకు రామ్ చరణ్ ఓ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ బర్త్‌డే వేడుకల్లో భాగంగా మెగా ఫ్యాన్స్ కోసం కామన్ డీపీని విడుదల చేశారు. కామన్ డీపీలో ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒక ఫొటోలో నవ్వుతూ మరో ఫొటోలో దీర్ఘ ఆలోచన చేస్తూ రెండు వేరియేషన్స్ ఉన్న ఫొటోతో అలరిస్తున్నారు. ఇక పోస్టర్‌కు ‘జనసేనాని’ అనే టైటిల్‌ని ఇవ్వగా.. సెలైన్ సూదులు ఉన్న పవన్ చేయి ‘మార్పు వచ్చే వరకూ ఎత్తులేస్తా’ అన్నట్టుగా ఉంది.   పవన్ కళ్యాణ్ కామన్ డీపీని రాంచరణ్ రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్‌గా మారింది. మెగా అభిమానులంతా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లో పవన్ ఫొటోను డీపీగా పెడుతున్నారు. #PawanKalyanBirthdayCDP హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. సెప్టెంబరు 2న వినాయక చవితి కూడా ఉండడంతో రెండు పండగలను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.

సంబంధిత వర్గం
చిత్రపురిలో ఇళ్లు దక్కనివారికి భరోసాగా నిలుస్తా -  ...
చిత్రపురిలో ఇళ్లు దక్కనివారికి భరోసాగా నిలుస్తా -  ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.