(Local) Sun, 20 Oct, 2019

మీట్ "బల్దేవ్ ప్రతాప్ సింగ్ ఫ్యామిలీ"......పోస్టర్

August 16, 2019,   4:44 PM IST
Share on:
మీట్

2010లో దర్శకుడు దేవాకట్ట తెరకెక్కించిన 'ప్రస్థానం' మూవీ తెలుగులో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో   సాయి కుమార్, సందీప్, శ్వరా నటించి మెప్పించారు. ఇప్పుడు ఇదే చిత్రాన్ని రీమేక్ చేసి డైరెక్టర్ దేవాకట్ట హిందీలో ప్రస్థానంగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ లో సాగె ఈ ప్రస్థానంలో సాయి కుమార్ పాత్రలో సూపర్ స్టార్ సంజయ్ నటిస్తున్నారు.  సంజయ్ దత్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మనిషా కొయిరాల సంజయ్ భార్యగా నటిస్తుండగా మరికొన్ని ముఖ్య పాత్రల్లో జాకీ ష్రాఫ్ – అలీ ఫైజల్ అమైరా దస్తూర్ – సత్యజిత్ దూబే వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు. దాదాపు పదేళ్ల తరువాత మనిషా కొయిరాల ఈ సినిమా ద్వారా సంజయ్ దత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.  ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 1న సింపుల్ గా మొదలైన సినిమా షూటింగ్ ఇప్పటికే కొన్ని షెడ్యుల్న్స్ ని పూర్తి చేసుకుంది. నేడు మనీషా కొయిరాలా బర్తడే సందర్బంగా ఈ సినిమాకు సంబందించిన ఓ స్పెషల్ పోస్టర్ ని సంజయ్ దత్ తన ట్విట్టర్ ఖాతాలో రిలీజ్ చేసారు. అందులో "మీట్ బల్దేవ్ ప్రతాప్ సింగ్ ఫ్యామిలీ" అంటూ ఒక క్యాప్షన్స్ ఇచ్చి పోస్ట్ చేసారు. ఆ పోస్టర్ లో సినిమాలో నటించే ప్రముఖ తారాగణం మొత్తం కనిపించడం విశేషం. ఈ మూవీ సెప్టెంబర్ 20  విడుదల కానుంది. 

సంబంధిత వర్గం
కెజిఎఫ్ మళ్ళీ మొదలైంది!!
కెజిఎఫ్ మళ్ళీ మొదలైంది!!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.