(Local) Thu, 05 Aug, 2021

వరలక్ష్మీ వ్రతం రోజున మహాలక్ష్మీ వచ్చేసింది మంచువారింట.....

August 09, 2019,   6:21 PM IST
Share on:
వరలక్ష్మీ వ్రతం రోజున మహాలక్ష్మీ వచ్చేసింది మంచువా ...

మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు భార్య మరోసారి గర్భం దాల్చిన సంగతి విదితమే. నిండు గర్భిణీ అయిన విరానిక కొద్దిసేపటి క్రితం ఓ పండంటి పాపకి కి జన్మ నిచ్చింది. దీంతో మంచు కుటుంబంలో వేడుకలు మొదలయ్యాయి. అసలే శ్రావణమాసం..అందులోనూ వరలక్ష్మీ వ్రతం రోజున ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మీ పుట్టిందని తెగ సంతోషపడుతున్నారు మంచు కుటుంబం. ఈ విషయాన్ని స్వయానా మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకోగా నెటిజెన్లు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే ఇదివరకే మంచు విష్ణు – విరానిక దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  అరియానా.. వివియానా అనే కవల అమ్మాయిలు.. అవ్రామ్ భక్త అనే అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు జన్మించిన పాప నాలుగవ సంతానం. ఈ వార్త తెలిసిన మంచు ఫ్యామిలీ సన్నిహితులు.. బంధువులు.. అభిమానులు విష్ణును అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

సంబంధిత వర్గం
“ఐరా విద్య
“ఐరా విద్య" కి...ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’
మంచు విష్ణు దంపతుల మధ్య కాజల్....!
మంచు విష్ణు దంపతుల మధ్య కాజల్....!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.