(Local) Mon, 12 Apr, 2021

హాట్‌ సిల్వర్‌ ఔట్‌ ఫిట్ లో మ‌లైకా...బర్త్ డే

October 23, 2019,   5:51 PM IST
Share on:
హాట్‌ సిల్వర్‌ ఔట్‌ ఫిట్ లో మ‌లైకా...బర్త్ డే

అర్జున్ కపూర్ ఈ పేరు చెప్పగానే టక్కున మరో పేరు కోసం అందరు వెతుకుతారని తెలిసిందే.... ఆమె ఎవరో కాదు మలైకా అరోరా. వీరిరువురు గత కొద్దీ కాలంగా డేటింగ్ చేస్తూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని చెప్పకనే చెప్పారు. అక్టోబర్ 23న తన 46వ బర్త్‌డే కావడంతో ఆమె ముంబైలో త‌న బ‌ర్త్‌డే పార్టీని ఘ‌నంగా జ‌రుపుకుంది. 46వ వసంతంలోకి అడుగిడిన మ‌లైకా త‌న బాయ్ ఫ్రెండ్ అర్జున్ క‌పూర్, స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌,  ట్వింకిల్ ఖన్నా, శిల్పా శెట్టి, తారా సుతారియా, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే,  జాన్వీ కపూర్, అర్జున్ రాంపాల్, రాజ్ కుమార్ రావు, శ్వేత బ‌చ్చ‌న్ నందా వంటి బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌తో క‌లిసి బ‌ర్త్‌డేని ఘ‌నంగా జ‌రుపుకుంది. సిల్వ‌ర్ ఔట్ ఫిట్స్‌లో మ‌లైకా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ పార్టీలో ఆమె వేసిన స్టెప్పులు అయితే హైలెట్‌ అనే చెప్పాలి. ఆమె ప్రియుడు అర్జున్‌ కూడా ఈ పార్టీలో తన స్టెప్పులతో రెచ్చిపోయాడు. పార్టీలో ఈ ఇద్దరు చేసిన డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.
 

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
సరికొత్తగా  ప్రమేషన్స్ నిర్వహించిన హౌస్ ఫుల్ 4.... ...
సరికొత్తగా ప్రమేషన్స్ నిర్వహించిన హౌస్ ఫుల్ 4.... ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.