(Local) Tue, 27 Jul, 2021

నేటితో శతదినోస్తవాన్ని పూర్తి చేసుకున్న ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘మహర్షి

August 16, 2019,   3:20 PM IST
Share on:
నేటితో శతదినోస్తవాన్ని పూర్తి చేసుకున్న ఎపిక్ బ్లా ...

సినిమా అనేది కేవలం వినోదం కోసమే అని చెప్పడానికి వీలు లేకుండా ఈ మధ్య విడుదలవుతున్న కొన్ని చిత్రాలలో సామాజిక దృక్పథాన్ని తెలియజెప్పే విధంగా ఉంటున్నాయి. అలాంటి ఓ చిత్రం 'మహర్షి'. ఈ చిత్రంలో కేవలం స్నేహం విలువలు మాత్రమే కాకుండా చాల వరకు రైతులు పడే సమస్యలు గురించి కూడా చక్కని రీతిలో కళ్ళకి కట్టినట్టుగా తెరకెక్కించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సినిమాలో  సూపర్ స్టార్ సరసన హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా, ఫ్రెండ్ గా అల్లరి నరేష్ నటించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి వంటి భారీ నిర్మాణ సంస్థల కలయికలో రూపొంది, మే 9న రిలీజైన మహర్షి సినిమా, అద్భుతమైన టాక్ మరియు అత్యద్భుతమైన కలెక్షన్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో మహేష్ మూడు విభిన్నమైన తరహా షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా గాజువాక, చిలకలూరిపేట, ఆదోని కేంద్రాల్లో డైరెక్ట్ గా, గుంటూరు, నెల్లూరు లో షిఫ్ట్ తో మొత్తం 5 కేంద్రాల్లో  100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్, దర్శకులు వంశీ పైడిపల్లి, అభిమానులకు మరియు యూనిట్ మొత్తానికి 100 డేస్ విషెస్ తెల్పుతూ ఒక పోస్టర్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేయగా సూపర్ స్టార్ ఫాన్స్  ఈ 100 డేస్ పోస్టర్ ని సోషల్ మాధ్యమాలలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. 

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.