(Local) Tue, 02 Mar, 2021

మహేష్ బాబు మేనల్లుడని లాంచ్ చేసిన రామ్ చరణ్

November 10, 2019,   4:11 PM IST
Share on:
మహేష్ బాబు మేనల్లుడని లాంచ్ చేసిన రామ్ చరణ్

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి లోక్‌సభ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను ఈరోజు లాంఛ్ చేశారు. రామ్ చరణ్ క్లాప్ కొట్టగా.. రానా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చత్రం కోసం ఆమె భారీగా పారితోషకం తీసుకుందని టాక్. అమర్‌ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమె మహేష్ బాబుకు పెద్దక్క.. ఈ సినిమాలో సీనియర్ నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. భిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.