(Local) Sun, 20 Jun, 2021

సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....

November 13, 2019,   5:01 PM IST
Share on:
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....

వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించగా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో ఈ ఏడాది సూపర్ స్టార్ ఖాతాలో బిగెస్ట్ హిట్ గా 'మహర్షి' సినిమా నిలిచింది. రీసెంట్‌గా ఈ మూవీ వంద రోజులు పూర్తి చేసుకుంది. రిషి జీవితంలో మూడుదశల్ని ప్రతిబింబిస్తూ కథను అల్లుకున్నారు. చిత్రంలో మహేష్‌బాబు, అల్లరి నరేష్, పూజాహెగ్డే మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు.

తాజాగా ఈ చిత్రం 2019 సంవ‌త్సరానికి గాను ట్విట్ట‌ర్‌లో అత్యంత ప్ర‌భావితం చేసే అంశాల‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది. మ‌రో ముఖ్య విశేష‌మేమంటే అజిత్ న‌టించిన విశ్వాసం చిత్రం తొలి స్థానం సంపాదించుకుంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.