(Local) Mon, 26 Aug, 2019

ప్రారంభమైన సూప‌ర్ స్టార్ ”ది హంబుల్ కో”......

August 08, 2019,   3:20 PM IST
Share on:

సూపర్ స్టార్ మహేష్ సినిమాలే కాకుండా కొన్ని వాణిజ్య ప్రకటనలకి  బ్రాండ్ అబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ తన సొంత బిజినెస్‌లు చేస్తూ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకుంటున్నాడు. ఈ మ‌ధ్యే ఏఏంబీ సినిమాస్ పేరుతో గ‌చ్చిబౌలిలోని ఓ మల్టీప్లెక్స్ నిర్మించాడు. తాజాగా మహేష్ క్లోత్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి కూడా విధితమే. దీనికోసం సూప‌ర్ స్టార్ ”ది హంబుల్ కో” అనే వెబ్ సైట్ కూడా స్టార్ట్ చేసాడు. తాజాగా మహేష్ బాబు బుధవారంనాడు ముందుగా చెప్పిన విధంగానే తన వస్త్ర వ్యాపారానికి సంబంధించిన బ్రాండ్ ”ది హంబుల్ కో” ని అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మహేష్ అభిమానులు పాల్గొని సందడి చేశారు. అలాగే ఈ బ్రాండ్ ప్రారంభానికి ముందు మహేష్ టీం నిర్వహించిన కాంటెస్ట్ లో విజేతలైన ఐదుగురు అభిమానులు సుధీర్ కుమార్ 33992, డి రాజేష్ రెడ్డి, మహేష్ నంబూరి, అంజలి ఓరుగంటి, అశోక్ శ్రీశైలపు లను మహేష్ ప్రత్యేకంగా కలవడం జరిగింది. మహేష్ ఐడియాస్ కు ఆలోచనలకు అనుగుణంగా బ్రాండింగ్ క్లాత్స్ ని డిజైన్ చేశారు. ఈ బ్రాండింగ్ క్లాత్స్ ని ఫ్యాషన్ రంగంలో పేరున్న ఆ కామర్స్ దిగ్గజం `స్పాయిల్ డాట్ ఇన్` (spoyl.page.link/TheHumblCo) మార్కెటింగ్ చేయబోతోంది. `హ్యాండ్ లూమ్ డే` ఆగస్టు 7న ఈ బ్రాండ్ ని మార్కెట్ లోకి విడుదల చేయడం ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. తన బ్రాండ్ మార్కెట్ లో ప్రత్యేకంగా వుండాలని మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. తనకు అత్యంత ఫిట్ గా వుండే క్లాతింగ్ నే ఇందుకు మహేష్ ఎంచుకున్నారట. అయితే ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని.. దీని కోసం బ్యాక్ ఎండ్ టీమ్ చాలా శ్రమించిందని మహేష్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వర్గం

ఊపిరితిత్తులు కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నా సూ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.