(Local) Mon, 27 Sep, 2021

మెహర్ రమేష్ కి మహేష్ సినిమా ఛాన్స్....

November 13, 2019,   5:30 PM IST
Share on:
మెహర్ రమేష్ కి మహేష్ సినిమా ఛాన్స్....

టాలీవుడ్ లో మెహర్ రమేష్ పేరు చాల పాపులర్..అతను తెలుగులో కేవలం నాలుగు చిత్రాలకి మాత్రమే దర్శకత్వం వహించారు. అందులో మూడు చిత్రాలు డిజాస్టర్స్ మిగిలినాయి... అగ్ర హీరోలతో భారీ డిజాస్టర్స్ తెరకెక్కించిన డైరెక్టర్ గా ఈయన కు మంచి గుర్తింపే ఉంది. వరుస ప్లాప్స్ ఇవ్వడం తో ఈయన తో సినిమాలు చేసేందుకు ఏ నిర్మాత , హీరో కాని సాహసం చేయడం లేదు. దీంతో గత కొన్ని ఏళ్లుగా అవకాశాల కోసం తీరుగుతూనే ఉన్నాడు. మహేష్ బాబు ఫ్యామిలీ కి, ఇటు మెగా ఫ్యామిలీ కి మంచి సన్నిహితుడుగా ఉంటున్న మెహర్‌కు మహేష్ ఓ సాయం చేసి పెడుతున్నట్లు సమాచారం.

తన కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను ఒక పెద్ద ఏరియాలో రిలీజ్ చేసే అవకాశం మెహర్‌కు ఇచ్చాడట. ఆంధ్రా ప్రాంతంలో బాగా బిజినెస్ జరిగే గుంటూరు ఏరియాలో 'సరిలేరు..' సినిమాను మెహరే రిలీజ్ చేయబోతున్నాడట.  చాలా కాలంగా మహేష్ బాబుతో సన్నిహితంగా ఉండే మెహర్‌ రమేష్‌కు నమ్రత రికమండేషన్‌ కారణంగానే ఈ హక్కులు దక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.