(Local) Sat, 24 Jul, 2021

‘ఆవిరి’ పై సూపర్ స్టార్ స్పందన....

October 01, 2019,   9:05 PM IST
Share on:
‘ఆవిరి’ పై సూపర్ స్టార్ స్పందన....

హాస్యనటుడిగా,ప్రతినాయకుడిగా తెలుగు తెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. ఆ తర్వాత దర్శకుడిగా మారి హీరో నరేష్ తో అల్లరి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు విభిన్న చిత్రాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హర్రర్ సస్పెన్స్ మూవీ 'ఆవిరి'. రవిబాబు నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వీక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ టీజర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందించారు. ‘సినిమా లవర్స్ కి హర్రర్ సినిమాలు అంటే మరింత ఇంట్రెస్ట్ ఉంటుంది, అటువంటి సినిమాలు తీయడంలో మంచి పేరున్న రవిబాబు గారు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆవిరి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ ఒక పోస్ట్ చేయడం జరిగింది…

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.