(Local) Fri, 05 Jun, 2020

మహేష్ బాబు పుట్టినరోజున సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ లుక్ రిలీజ్

August 07, 2019,   9:28 PM IST
Share on:
మహేష్ బాబు పుట్టినరోజున సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ లు ...

మహేష్ బాబు 26వ సినిమా  సరిలేరు నీకెవ్వరూ . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రైన్ సెట్ లో షూట్ జరుగుతున్నది.  ఇదిలా ఉంటె, ఈనెల 9 వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు.  ఆ రోజున సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియడం లేదు.  యూనిట్ దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.  అయితే, అదే రోజున మహేష్ బాబు సూపర్ హిట్ దూకుడు సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతున్నారు.  అదీకూడా ఏఎంబి సినిమాస్ లో.  ఫ్యాన్స్ కోసం ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.