(Local) Sat, 24 Jul, 2021

మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతులు

October 21, 2019,   6:07 PM IST
Share on:
మహారాష్ట్ర ఎలక్షన్స్ లో మెరిసిన రితేష్..జెనీ దంపతు ...

జెనీలియా ఈ పేరు వినగానే గుర్తికు వచ్చేది 'వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ చెప్పే బొమ్మరిల్లు మూవీ డైలాగ్... ఒకప్పుడు టాలీవుడ్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకర్షించిన బ్యూటీ జెనీలియా. ఇటు తెలుగు,తమిళ్, హిందీ ఇండస్ట్రీల్లో తనదైన నటనతో అందరిని మెప్పించి చెరగని ముద్ర వేసిన అమ్మడు ప్రస్తుతం సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక చాలా రోజుల తరువాత జెనీలియా మహారాష్ట్ర ఎలక్షన్స్ హడావుడిలో తళుక్కున మెరిసింది. తన ఓటు హక్కును వినియోగించుకొని అందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని వివరణ ఇచ్చింది. ఓటు వేసిన తరువాత భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి అందంగా నవ్వుతూ సెల్ఫీకి స్టిల్ ఇచ్చింది. ఆరెంజ్ – నా ఇష్టం సినిమాల అనంతరం జెనీలియా మళ్ళీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ లో కూడా సినిమాలు మెల్లగా తగ్గించేసింది. 2012లో రితేష్ ని పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన హాసిని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. మహారాష్ట్రలో జరుగుతున్న ఎలక్షన్స్ లో చాలా మంది సినీ ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

సంబంధిత వర్గం
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం
మహారాష్ట్రలో ఓటు వేసిన క్రికెట్ దిగ్గజం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.