(Local) Sun, 16 Feb, 2020

న్యూ లుక్ తో అదరగొడుతున్న బాలయ్య...

November 09, 2019,   11:17 PM IST
Share on:
న్యూ లుక్ తో అదరగొడుతున్న బాలయ్య...

సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌ నిర్మాణంలో కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `రూల‌ర్‌'. ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి బాలకృష్ణ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రయూనిట్ బాలయ్య లుక్ కి సంబంధించి మరో పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. ప‌ర్టికుల‌ర్‌గా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. `రూల‌ర్‌` షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత వర్గం
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
నటసింహంను అవమానించిన తమిళ  కమెడియన్.. ఫ్యాన్స్ ఫైర ...
నటసింహంను అవమానించిన తమిళ కమెడియన్.. ఫ్యాన్స్ ఫైర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.