(Local) Sun, 20 Jun, 2021

సాహోలో ఆర్ట్‌ను కాపీ కొట్టారు....బాలీవుడ్ భామ ఫైర్

August 31, 2019,   4:17 PM IST
Share on:
సాహోలో ఆర్ట్‌ను కాపీ కొట్టారు....బాలీవుడ్ భామ ఫైర్

యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్  హీరోగా, బాలీవుడ్ శ్రద్ధ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో. ఈ చిత్రం నిన్న ఆగష్టు 30న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విడుదలైన తొలి రోజునే డివైడ్ టాక్‌ను తెచ్చుకున్న వ‌సూళ్ల ప‌రంగా తొలిరోజున `సాహో` రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ సాహో ఒక ఆర్టిస్ట్ వర్క్ ను కాపీ కొట్టిందంటూ సోషల్ మీడియాలో పెట్టేసింది. విషయం ఏంటంటే షిలో శివ్ సులేమాన్ అనే ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ ను యధాతధంగా సాహో లో `బేబీ వోన్ట్ యు టెల్‌మీ..` సాంగ్ లో వాడేశారనీ ఇందుకు తగ్గ రుసుమును ఆ ఆర్టిస్ట్ కు చెల్లించలేదని లిసా రే సోషల్ మీడియాలో పేర్కొంది. కనీసం ఆమెకు అందుకు తగ్గ గుర్తింపు కూడా ఇవ్వలేదని, ఎక్కడా దీనిని స్ఫూర్తి పొందడం అన్నారని ఇది పూర్తిగా మరొక ఆర్టిస్ట్ ప్రజ్ఞను దోచుకోవడమే అనీ ఇటువంటివి అందరూ నిలదీయాలని రాసుకొచ్చింది. కాగా ఒరిజిన‌ల్ పోస్ట‌ర్‌ను లీసారే త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.