(Local) Fri, 07 May, 2021

అక్కి ‘లక్ష్మీ బాంబ్’ ఫ‌స్ట్ లుక్....

October 03, 2019,   8:26 PM IST
Share on:
అక్కి ‘లక్ష్మీ బాంబ్’ ఫ‌స్ట్ లుక్....

ముని, కాంచన, గంగ, ఈ సినిమా పేర్లు చెప్పగానే ముందు గుర్తుకి వచ్చేది రాఘవ లారెన్స్. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు కొరియోగ్రాఫర్ గా  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి  సినీ నటుడు, దర్శకుడిగా మారి తనదైన స్టయిల్ లో దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా లారెన్స్ బాలీవుడ్ హీరో అక్కి తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాంచన మూవీని బాలీవుడ్‌లో 'లక్ష్మీబాంబ్' పేరుతో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. రీసెంట్‌గా 'లక్ష్మీబాంబ్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాంచన ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే హిజ్రా క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం.. శరత్ కుమార్ ఆ క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. 'లక్ష్మీబాంబ్' లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ రోల్ చెయ్యనున్నారని వార్తలు వచ్చాయి. కట్ చేస్తే అక్షయ్ కుమారే హిజ్రా క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లుక్ రివీల్ చేశారు. చీరకట్టులో, మహిషాసురమర్దిని విగ్రహం ముందు నిలబడి ఉన్న అక్షయ్ లుక్ బాగుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఎల్ఎల్‌పి, తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్, షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌ కలిసి నిర్మిస్తున్న లక్ష్మీబాంబ్ 2020 జూన్ 5న విడుదల కానుంది.

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్....
‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ టాక్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.