(Local) Tue, 02 Mar, 2021

అనసూయ పాత్రపై సస్పెన్స్...!

October 12, 2019,   1:46 PM IST
Share on:
అనసూయ పాత్రపై సస్పెన్స్...!

అనసూయ తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు... బుల్లితెరపై వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన ఆమె జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇటు యాంకరింగ్ తో పాటు సినిమాల్లో కూడా నటించడం స్టార్ట్ చేసింది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో బుజ్జి పాత్రలో అక్కినేని నాగార్జునతో కలసి నటించింది. ఆ తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే అనసూయకి కి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం లో చిత్రంలో రంగమ్మత్తగా ఎప్పటికి గుర్తుండిపోయే రోల్ ఇచ్చాడు. ఆ సినిమాతో అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలంతో అనసూయ కి మంచి హిట్ ఇచ్చాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించబోయే చిత్రంలోను అనసూయ ఓ కీలకపాత్ర చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న కొరటాల – చిరు సినిమాలో చిరు ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టు గా చెప్పడమే కాదు యంగ్ చిరు పాత్రకి చరణ్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాలో అనసూయ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అసలు ఈ సినిమాలో అనసూయకి రోల్ ఏమంత ప్రాధాన్యత ఉండదని సమాచారం. తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే నటించే అనసూయ ఈ చిన్న పాత్ర చేస్తుందా చెయ్యదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.