(Local) Wed, 20 Oct, 2021

అనుష్క 'నిశ్శబ్దం' లో హాలీవుడ్ స్టార్ ఫస్ట్ లుక్....

November 21, 2019,   6:05 PM IST
Share on:
అనుష్క 'నిశ్శబ్దం' లో హాలీవుడ్ స్టార్ ఫస్ట్ లుక్.. ...

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మాణంలో హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో లవర్ బాయ్ ఆర్‌.మాధ‌వ‌న్‌, అనుష్క‌ శెట్టి, ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ కీలక పాత్రలు పోషించగా....గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హాలీవుడ్‌కి చెందిన న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ర‌చ‌యిత, ఫొటోగ్రాఫ‌ర్ మైకేల్ మ్యాడ్‌స‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆయన ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న ఈ హాలీవుడ్ న‌టుడు `నిశ్శ‌బ్దం` చిత్రంలో రిచ‌ర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. గురువారం ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి స‌హా ప‌లువురు ఇండియ‌న్స్ యాక్ట‌ర్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్ మ్యాడ్ స‌న్ వంటి స్టార్స్ నటిస్తుండగా షానియ‌ల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సంబంధిత వర్గం
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.