(Local) Sat, 24 Jul, 2021

'మిస్ ఇండియా' మారనుందా మహానటి...?

August 08, 2019,   5:55 PM IST
Share on:
'మిస్ ఇండియా' మారనుందా మహానటి...?

2016లో వచ్చిన నేను శైలజ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షుకులకి హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్. అంతేకాక ఈమె అలనాటి నటి మేనకా కుమార్తె. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ తెలుగులో మాత్రం అలనాటి మహనటి సావిత్రి గారి బయోపిక్ లో 'మహనటి సావిత్రిగా నటించి మెప్పించింది. ఆ సినిమాలో తన అద్భుత నటనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన తర్వాత అందరూ కీర్తిని మహానటి అని పిలవడం మొదలు పెట్టారు. అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఈ సినిమాకి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమా కథకి ఈ టైటిల్ బాగా సరిపోతుందని నిర్మాత, దర్శకుడు భావిస్తున్నారట. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ‘118’ లాంటి మంచి సక్సెస్ తర్వాత ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ మూవీ నిర్మిస్తున్నారు. మహిళలపై జరిగే ఆకృత్యాల గురించి ఈ సినిమాలో ప్రస్తావిస్తారట.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.