(Local) Thu, 21 Nov, 2019

టిక్ టాక్ వీడియోస్ చేయడం ఎలా అంటున్న ‘బిగ్ బి’...

August 24, 2019,   6:15 PM IST
Share on:
టిక్ టాక్ వీడియోస్ చేయడం ఎలా అంటున్న ‘బిగ్ బి’...

 కౌన్‌ బనేగా కరోడ్‌పతి అనగానే ఇప్పటికే 10 సీజన్స్ కంప్లీట్ చేసుకుని 11వ సీజన్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అయిదు ఎపిసోడ్స్ పూర్తీ చేసుకున్న కేబీసీ షో నాలుగో ఎపిసోడ్ టీజర్‌ వీక్షకులను బాగా ఆకట్టుకుంది.  టిక్‌టాక్‌ వీడియోలు చేయడానికి ఆసక్తి చూపే యువకుడిని బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్  చిట్కాలు అడిగి తెలుసుకున్నారు. ఆద్యంతం సరదాగా సాగే ఈ సంభాషణలో సదరు యువకుడు టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలను స్క్రీన్‌పై చూపించారు. అంతేకాక టిక్‌టాక్ వీడియోలు ఎలా చేయాలో తెలుపడంతో.. షో వీక్షకులకు కనువిందు చేయనుంది. మరోవైపు, ఉన్నావ్‌కు చెందిన యువతి నుపూర్ చౌహాన్ ఇతివృత్తాన్ని తెలిపే గాథ కూడా ఇవాళ టెలికాస్ట్‌ కానుంది. ఈ ఎపిసోడ్‌లో జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ట్యూషన్‌ టీచర్‌గా రాణించడంపై తన అనుభవాలను పంచుకుంది. కేబీసీ షోలో హాట్ సీటు పొందే అవకాశం రావడంతో ఆమె స్పూర్తిదాయకంగా మారింది.

సంబంధిత వర్గం
ఈ షో ఆడవారికి మాత్రమే....హోస్ట్ గా అలనాటి నటి
ఈ షో ఆడవారికి మాత్రమే....హోస్ట్ గా అలనాటి నటి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.