(Local) Sun, 20 Oct, 2019

దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి....

September 21, 2019,   4:55 PM IST
Share on:
దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి....

ఆర్ఎక్స్ 100 సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ.  హిప్పీ, గుణ 369 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సంపాదించకపోయిన ఆ మాత్రం డీలా పడకుండా పలు చిత్రాలలో నటిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నానీస్ గ్యాంగ్ లీడర్‌లో నెగెటివ్ క్యారెక్టర్‌లోనూ ఆడియన్స్‌ను మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కార్తికేయ '90ML' అనే సినిమా చేస్తున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ  సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. 
నేడు సెప్టెంబర్ 21న కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘90ML’ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. "నా కడుపునా దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది.  టీజర్‌లో నటుడు అజయ్‌తో కార్తికేయ ‘అరెయ్‌ డీజిల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. ఇది లిక్కర్‌తో నడిచే బండి. గుద్దితే అడ్రస్‌ ఉండదు.’ అంటూ సాగిన డైలాగ్‌ మాస్‌ను విపరీతంగా అలరించనుంది. మరో సీన్‌లో అలీ కార్తికేయతో ‘డైలీ ఎంత వేస్తావ్‌..’ అని అడగ్గా ‘పూటకు 90ML సార్‌..’ అని కార్తికేయ చెబుతుండగా.. అలీ  ‘ఏ క్వార్టర్‌ ఇస్తే తాగవా?’ అని ప్రశ్నించగా.. ‘డాక్టర్‌ 90 ml మాత్రమే తాగమన్నారు.’ అంటూ చెప్పిన డైలాగులు అదరగొడుతున్నాయి.  కార్తికేయ ఈ మూవీలో దేవదాస్ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన దేవదాస్ మందుకి ఎలా బానిసయ్యాడు.. దానికి కారణాలేంటి అనే అంశాలతో కామెడీ హైలెట్‌గా ఈ సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో క్లైమాక్స్ షూట్ చేశారు.
 

సంబంధిత వర్గం
'అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు'....అంటున్న కారికేయ
'అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు'....అంటున్న కారికేయ
రివ్యూ: గ్యాంగ్ లీడర్...
రివ్యూ: గ్యాంగ్ లీడర్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.