(Local) Wed, 24 Jul, 2019

“గుణ 369” విడుదల ముహూర్తం ఖరారు!

July 04, 2019,   1:14 PM IST
Share on:

'పిల్ల రా' అనే సాంగ్ వినపడగానే గుర్తుకి వచ్చేది హీరో కార్తికేయ. ‘ఆర్‌‌ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కార్తికేయ గుమ్మకొండ. ఆ తరువాత వచ్చినా ‘హిప్పీ’ చిత్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇప్పుడు కార్తికేయ మరో సినిమాతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జోనర్ లో ‘గుణ 369’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ “గుణ 369” మూవీని వచ్చేనెల ఆగష్టు 2న విడుదల చేస్తున్నట్లు హీరో కార్తికేయ తన ట్విట్టర్ అకౌంట్ స్వయంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసాడు.  ఒకచేతిలో రక్తం మరకలతో వేటకొడవలి,మరో చేతిలో వేడివేడి టీ పట్టుకొని కూర్చొని ఉన్న కార్తికేయ ఫోజ్ చూస్తుంటే ఈ మూవీలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలకు కొదవలేదనిపిస్తుంది. కార్తికేయ సరసన అనఘా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్ప్రింట్స్ ఫిలిమ్స్,జ్ఞాపికా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తిరుమలరెడ్డి,అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తుండగా చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.