(Local) Fri, 22 Oct, 2021

భూల్ భులయ్యా2..మోషన్ పోస్టర్ విడుదల...

August 19, 2019,   3:59 PM IST
Share on:
భూల్ భులయ్యా2..మోషన్ పోస్టర్ విడుదల...

1993లో డైరెక్టర్ ఫాజిల్‌ దర్శకత్వంలో  మోహన్‌లాల్‌, సురేష్‌ గోపీ హీరోలుగా శోభన హీరోయిన్‌గా నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రం  మనిచిత్రతజు. మళయాళం లో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళ, తెలుగు భాషల్లో రజనీ కాంత్‌ హీరోగా 'చంద్రముఖి' పేరుతో రీమేక్‌ చేశారు. అలాగే కన్నడంలో 'ఆప్త్తమిత్ర', బెంగాలీలో 'రాజ్‌ మోహల్‌', తెరకెక్కించగా ఇక హిందీలో  2007లో అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో భూల్ భులియా పేరుతో రిరీమేక్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టిన ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది.

బాలీవుడ్ లో ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ భూల్ భూలియా 2లో నటించనున్నాడు. సినిమాకు సంబందించిన ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమాను వరల్డ్ వైడ్ గా 2020 జులై 31న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. బాలీవుడ్ లో వెల్కమ్, రెడీ , సింగ్ ఈజ్ కింగ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న అనీస్ బాజ్మీ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – మురాద్జ్ ఖేతని సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు
 

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.