(Local) Sat, 31 Oct, 2020

డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

November 25, 2019,   5:44 PM IST
Share on:
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

విభిన్నమైన కథాంశంతో వెండితెరపై తనదైన స్టైల్ లో దూసుకుపోతు తమిళ్ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ఆడియన్స్ కూడా మెప్పిస్తూ దూసుకుపోతున్న స్టార్ హీరో కార్తీ... ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు 'దొంగ' గా రాబోతున్నాడు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ, ” ‘దొంగ’ నా కెరీర్ లో మరో విభిన్న చిత్రం. వెరైటీ చిత్రాలని ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దొంగ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు. మా వదిన గారు జ్యోతిక ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సత్యరాజ్ గారు మరో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. నా కెరీర్ లో మరో మెమొరబుల్ ఫిలిం.” అన్నారు

నిర్మాణ సంస్థలు వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ సినిమా గురించి వెల్లడిస్తూ, ” షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.” అన్నారు. ఖైదీ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కార్తీ కి దొంగ మరో బ్లాక్ బస్టర్ కాబోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.