(Local) Mon, 12 Apr, 2021

వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ఆవిష్కరించనున్న కరీనా...

October 31, 2019,   5:34 PM IST
Share on:
వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ఆవిష్కరించనున్న కరీనా...

సైఫ్ అలీఖాన్ సతీమణి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు అరుదైన అవకాశం దక్కింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళ, పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ఆవిష్కరణ వేడుక మెల్‌బోర్న్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో వరల్డ్‌ కప్‌ ట్రోఫీని కరీనా కపూర్‌ ఆవిష్కరించనున్నారు.దీనిపై కరీనా సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్ ట్రోఫీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం గర్వంగా ఉందని చెప్పారు. ఇది తనకు లభించిన అత్యంత గౌరవమని పేర్కొన్నారు.

అంతేకాక తన మామయ్య (మన్సూర్‌ పటౌడీ అలీఖాన్‌) కూడా  ప్రముఖ క్రికెటర్‌ అని కరీనా గుర్తు చేశారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభంకానుంది. మెల్‌బోర్న్ వేదికగా సిరీస్ ప్రారంభంకానుంది. గతంలో కంటే ఈసారి ఎక్కువ దేశాలు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను ఐసీసీ వెల్లడించనుంది. బాలీవుడ్ నుంచి ఓ స్టార్ వరల్డ్ కప్ ఆవిష్కరించేందుకు అవకాశం దక్కడంతో అంతా  ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

సంబంధిత వర్గం
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.