(Local) Sat, 19 Oct, 2019

'జయలలిత' కోసం కంగన....

September 21, 2019,   5:07 PM IST
Share on:
'జయలలిత' కోసం కంగన....

చిత్రరంగంలో వైవిధ్యభరితమైన పాత్రలలో కథానాయికగా  తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించి మెప్పించిన అలనాటి నటి జయలలిత. తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలిన జయలలిత, తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి  తమిళనాడు రాష్ట్రానికి రెండో మహిళా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు, ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి అని పిలుచుకుంటా ఉంటారు. అలాంటి దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ “త‌లైవీ” అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంగనా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొంద‌నుంది. సినిమాకు విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ‘ది డర్టీ పిక్చర్’ రచయిత రజత్ అరోరా కంబైన్డ్‌గా కథను రూపొందించారు. హిందీలో “జ‌య” టైటిల్‌తో విడుద‌ల కానున్న ఈ చిత్రం కోసం కంగ‌నా భారీ పారితోషికం డిమాండ్ చేసింద‌ని టాక్. “త‌లైవీ” సినిమాలో జ‌య‌ల‌లితగా క‌నిపించేందుకు కంగనా స‌న్నాహాలు చేసుకుంటుంది. ఇటీవ‌ల అమెరికాలోని లాంజ్ ఏంజెల్స్‌కి వెళ్లిన ఈ అమ్మ‌డు ప్ర‌ముఖ హాలీవుడ్ ఫేమ‌స్ ఆర్టిస్ట్‌ జేస‌న్ కోలిన్స్ ని క‌లిసింది. ఆయ‌న త‌న స్టూడియోలో కంగనాకి ప్రోస్తెటిక్ ట్రీట్మెంట్ చేశారు. కంగ‌నాని జ‌య‌ల‌లితగా చూపించ‌బోతున్నారు. అయితే ట్రీట్మెంట్ స‌మ‌యంలో తీసిన‌ ప్రోస్తెటిక్ మేక‌ప్ ఫోటోల‌ని కంగ‌నా సోష‌ల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జ‌య‌ల‌లిత బ‌యోపిక్ మైండ్ బ్లోయింగ్ అవుతుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. జేసన్ కాలిన్స్ గతంలో కెప్టెన్ మార్వెల్ సినిమా కోసం పని చేసేవార‌న్న విష‌యం కూడా వారు తెలిపారు 

సంబంధిత వర్గం
హౌస్ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..
హౌస్ఫుల్ 4: భూత్ సాంగ్ విడుదలైంది..
టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను హిట్ కొట్టాడు!
టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను హిట్ కొట్టాడు!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.