(Local) Mon, 30 Nov, 2020

'ఆమె' గా క్వీన్...?

October 23, 2019,   4:46 PM IST
Share on:
'ఆమె' గా క్వీన్...?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించే సినిమాలు చాల సెల‌క్టివ్‌గా విభిన్నమైన కథాంశంతో ఉంటాయని ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ బాలీవుడ్ భామ కోలీవుడ్ చిత్రంలో నటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ బ్యూటీ అమ‌లాపాల్ న‌టించిన తాజా చిత్రం ఆడై. ఈ చిత్రం తెలుగులో ఆమె పేరుతో రిలీజ్ అయింది. చిత్ర టీజ‌ర్‌లో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా చూపించి సినిమాపై భారీ అంచ‌నాలు పెంచారు. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ చిత్రంలో అమలా పాల్ న్యూడ్‌గా నటించిన విషయం తెలిసిందే. అసభ్యతకు తావులేకుండా అమలా ఆ పాత్రను చక్కగా పోషించి మెప్పించింది. 
అయితే ఈ చిత్రాన్ని హిందీలో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు దర్శకుడు రత్నకుమార్ తన పేస్‌బుక్ పేజీలో వెల్లడించాడు. అమలా పాల్ పోషించిన పాత్రను హిందీలో ఒక ప్రముఖ హీరోయిన్ పోషించనుందని చెప్పాడు. ఆడై చిత్ర అనువాద హక్కులను పొందిన దర్శక, నిర్మాత విక్రమ్ భట్ ఈ కథను కంగనా రనౌత్‌కు వినిపించినట్లు తెలుస్తోంది . కంగనా రనౌత్ కథ విని కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం. అమలా పాల్ తరహాలో న్యూడ్‌గా నటించేందుకు కంగనా ఒకే చెప్పిందన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోంది.

సంబంధిత వర్గం
‘తలైవి’ గా కంగ‌నా ఫస్ట్‌లుక్ అవుట్....
‘తలైవి’ గా కంగ‌నా ఫస్ట్‌లుక్ అవుట్....
మోడీ,జిన్‌పింగ్‌ల చారిత్రక సదస్సు నేపథ్యంలో కట్టుద ...
మోడీ,జిన్‌పింగ్‌ల చారిత్రక సదస్సు నేపథ్యంలో కట్టుద ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.