(Local) Wed, 21 Aug, 2019

మహేష్ బర్త్ డే కంటే కులాభిమానమే ఎక్కువ...వర్మ

August 10, 2019,   3:59 PM IST
Share on:

రామ్ గోపాల్ వర్మ ని ఈ మధ్య స్టార్ డైరెక్టర్ అని పిలవడంకంటే వివాదాల వర్మ అని పిలవడం స్టార్ట్ చేసారు. ఆలా పిలిచినందుకైనా ఎదో ఒక వివాదం ఉండాలి అన్నటు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఎదో ఒక రకంగా వివాదాస్పదమైన ట్వీట్లు చేస్తున్నాడు. తాజాగా వర్మ సూపర్ స్టార్ మహేష్ బర్తడే గురించి, కులానికి సంబందించి ఒక ట్వీట్ చేసాడు. అది ఏంటి అంటే... ‘జనాలకు సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు కన్నా కులాభిమానమే ఎక్కువైంది.. అందుకే నా ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ పాట ట్రెండింగ్ 1లో వుంది’ అని వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అతని వ్యాఖ్యలను బట్టి వర్మ మహేశ్ బాబును టార్గెట్ చేశాడా అని కొందరు కామెంట్లలో అడుగుతున్నారు. నిన్న మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ మహశ్ కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోంచి హీరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అంతేకాక వర్మ కూడా ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్ సాంగ్ ని విడుదల చేయడం జరింగింది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ట్రేండింగ్ జాబితాలో లో వర్మ టైటిల్ సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ప్రిన్స్ ఫస్ట్ లుక్ ఇంట్రో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 

సంబంధిత వర్గం

మహర్షి మూవీ నుండి తొలగించిన సన్నివేశం.....
మహేశ్ పుట్టినరోజు కానుకగా…’సరిలేరు నీకెవ్వరు’ ఇంట్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.