(Local) Mon, 27 Sep, 2021

భారతీయుడు 2 కి మళ్ళీ బ్రేక్...

November 06, 2019,   7:41 PM IST
Share on:
భారతీయుడు 2 కి మళ్ళీ బ్రేక్...

యూనివర్సల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ శంక‌ర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇండియ‌న్ 2. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ  సినిమాలో కమల్‌ కి జోడీగా కాజల్ నటిస్తోంది. అంతేకాక ఈ మూవీలో మోలీవుడ్ యంగ్ క్రేజి హీరో దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో కనిపిస్తుండగా, బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తారని సమాచారం. శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గ్వాలియ‌ర్‌ల‌లో కొద్దిరోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి తాత్కాలిక బ్రేక్ వేసిన‌ట్టు తెలుస్తుంది. రేపు (నవంబర్ 7న) క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజుతో పాటు ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి 60 సంవ‌త్స‌రాలు పూర్తి చేసిన‌ సంద‌ర్భంగా చెన్నైలో ఘ‌నంగా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు క‌మ‌ల్ చెన్నై వ‌స్తున్నందున‌ చిత్ర షూటింగ్‌ని నిలిపివేశారు. ఈ నెల 13 నుండి కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత వర్గం
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.