(Local) Mon, 17 Jun, 2019

జూన్ 28న రానున్న కల్కి!

June 10, 2019,   12:33 PM IST
Share on:

'గరుడ వేగ' చిత్రంతో సక్సెస్ ఇచ్చిన యాంగ్రీ మెన్ డా. రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై ప్రముఖ నిర్మాత సి.క‌ల్యాణ్‌ నిర్మిస్తున్నారు. `అ` వంటి ప్రయాగాత్మక, విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా జీవితా రాజశేఖర్ సినిమా గురించి చెబుతూ  "డిఫరెంట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా 'కల్కి'. "పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన కమర్షియల్ ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ టాప్ ట్రెండ్స్ లో నిలిచింది అని తెలియజేస్తూ, రాజశేఖర్ గారి ఇమేజ్‌కి త‌గ్గ విధంగా కొత్త తర‌హా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను ప్రశాంత్ వర్మ తీశారు. ఆయన కథ, దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి" అని అన్నారు. త్వరలో పాటల్ని విడుదల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించాడు. నేపథ్య సంగీతం కూడా బాగా చేసారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.