(Local) Thu, 01 Oct, 2020

క్వీన్ సినిమా ఆలస్యానికి కాజల్ కారణమా?

August 07, 2019,   9:26 PM IST
Share on:
క్వీన్ సినిమా  ఆలస్యానికి కాజల్ కారణమా?

తెలుగులో స్టార్ హీరోలతో వరసగా సినిమాలు చేసి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కాజల్కి  ఒకానొక దశలో  సినిమాలు తగ్గిపోయాయి. కానీ, తన తెలివితో కాజల్ తిరిగి సినిమా అవకాశాలు దక్కించుకుంది.  తెలుగుతో పాటు తమిళంలో కూడా అనేక సినిమాలు చేసింది.  తాజాగా బాలీవుడ్ లో సూపర్ హిట్టైన క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేశారు.  నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్లు.  సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి.  మంచి రెస్పాన్స్ వచ్చింది.  తమిళ రీమేక్ లో కాజల్ హీరోయిన్.  తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ట్రైలర్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయో.. ఒక్క తమిళ్ ట్రైలర్ కు అన్ని వ్యూస్ వచ్చాయి.  మిగతా మూడు భాషల సెన్సార్ కూడా పూర్తయింది.  కానీ, తమిళంలో ఈ సినిమాకు సెన్సార్ చిక్కుల్లో ఉన్నది.  సినిమా సెన్సార్ పూర్తికాలేదు.  కారణం ఆ సినిమాలోని కొన్ని వల్గర్ సీన్స్ అని తెలుస్తోంది.  ఈ సెన్సార్ చిక్కులను తప్పుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. 

సంబంధిత వర్గం
రాజమహేంద్రవరం జైల్లో యూనివర్సల్ హీరో....
రాజమహేంద్రవరం జైల్లో యూనివర్సల్ హీరో....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.