(Local) Sun, 27 Sep, 2020

ఆటోలో ప్రయాణించిన హీరోయిన్.... వీడియో వైరల్

August 23, 2019,   11:27 PM IST
Share on:
ఆటోలో ప్రయాణించిన హీరోయిన్.... వీడియో వైరల్

2014లో బాలీవుడ్ లో ఫ్యూగ్లీలో చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి తెరంగ్రేటం చేసిన కియారా అద్వానీ...2018లో కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్ర ద్వారా సూపర్ స్టార్ మహేష్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. తాజాగా కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో భారీ హిట్ అందుకుంది. కబీర్ సింగ్ హిట్ తరువాత ఆమెకు వరసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో లక్ష్మి బాంబ్ సినిమాలో నటిస్తోంది. సౌత్‌లో సంచలన విజయం సాధించిన కాంచన సినిమాకు ఇది రీమేక్. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నది.  షూటింగ్ పూర్తి చేసుకున్నాక కియారా అద్వానీ.. తన కొరియోగ్రాఫర్‌తో ఆటోలో ప్రయాణం చేసింది. ఆమె ప్రయాణం చేస్తున్నంత సేపు.. దారిలో కనిపించిన వాళ్లకు హాయ్ చెప్తూ.. వెళ్ళింది. ఇలా ఆటోలో ప్రయాణం చేయడం షూటింగ్‌లో భాగమా లేదంటే.. కారు బోర్ కొట్టి ఆటోలో వెళ్లిందా అన్నది ముంబై వాసులకు అర్ధంకాలేదట. ప్రస్తుతం ఆమె ఆటోలో ప్రయాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వర్గం
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.